తెలంగాణా ఉద్యమాన్ని కొందరు మదమెక్కిన ఆంధ్రానాయకులు నక్సలైట్ ఉద్యమంతో పోలుస్తున్నారు. అసలు నక్సలైట్ ఉద్యమం పుట్టిందే ఆంధ్రా ప్రాంతలో అన్న విషయం వాళ్ళు మరచినట్టున్నారు.మీ ఆంధ్రా పాలన పోయి మా తెలంగాణా మాకొస్తే మా దగ్గర నక్సలైట్ అనేవాడే కనపడడు. ఎందకంటే మా ఉద్యోగాలను కొల్లగొట్టింది మీరు, మా వ్యవసాయ భూముల్ని బీళ్ళుగా మర్చింది మీరు. అసలు మీరే లేకుంటే తెలంగాణాలో నక్సలైటే ఉండడు. ఇక్కడ ఏ అసాంఘిక శక్తీ లేదు ఉన్నవన్నీ తెలంగాణా శక్తులే. మీ భూస్వామ్య వలసవాద మనస్తత్వానికి మా బ్రతుకుపోరాటం నక్సలిజం లాగానే కనపడుతుంది. ఈ ఉద్యమాన్ని అనగదొక్కాలనుకుంటే ఇప్పుడు నిజంగా ప్రతివిద్యార్ది నక్సలైటైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.
లగడపాటి రాజగోపాల్ ఉస్మానియా విద్యార్దులను తాలిబాన్లతో పోల్చాడు. ధాంక్స్ టు హిమ్. ఎందుకంటే ఆఫ్ఘనీబాషలో తాలిబాన్ అంటే విద్యార్ది అని అర్దం. బహుశా ఈ విషయం బఫూన్ ఆయిన లగడపాటికి
తెలియకపోయుండవచ్చు ఉండకపోవచ్చు.
No comments:
Post a Comment